అఖిల్ ని లాంచ్ చేయనున్న నితిన్ ఫాదర్.!

అఖిల్ ని లాంచ్ చేయనున్న నితిన్ ఫాదర్.!

Published on Oct 24, 2014 3:38 PM IST

Akhil_Sudharkar-Reddy

అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున వారసుడిగా ఈ తరం హీరోగా త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్న హీరో అక్కినేని అఖిల్. ఈ సంవత్సరం ‘మనం’ సినిమా చివర్లో ఒక 2 నిమిషాలు కనిపించి అందరినీ ఆకట్టుకున్న అఖిల్ సోలో హీరోగా లాంచ్ అవ్వడానికి రంగం సిద్దం అయ్యింది. అఖిల్ హీరోగా పరిచయం కానున్న సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడని ఇది వరకే తెలియజేశాం.

కానీ ఈ సినిమా ఎవరు నిర్మిస్తున్నారు అనే విషయంపై క్లారిటీ లేదు.. కానీ మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం నితిన్ ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డి తన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించనున్నారు. మామూలుగా నాగార్జున తన సొంత బ్యానర్ లో అఖిల్ ని లాంచ్ చేస్తారని అనుకున్నారు, కానీ నాగార్జున మాత్రం అఖిల్ ని లాంచ్ చేసే చాన్స్ సుధాకర్ రెడ్డికి ఇచ్చారు. అఖిల్ మొదటి సినిమాకి ‘ఢమరుకం’ ఫేం వెలిగొండ శ్రీనివాస్ కథని అందిస్తుంటే కోన వెంకట్ – గోపి మోహన్ డైలాగ్స్ రాస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అఖిల్ సరసన జోడీ కట్టే హీరోయిన్ కోసంకూడా అన్వేషణ జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు