అన్నీ విదేశాల్లోనే అంటున్న స్టార్ హీరో !

అన్నీ విదేశాల్లోనే అంటున్న స్టార్ హీరో !

Published on May 29, 2017 4:44 PM IST


‘అ..ఆ’ చిత్రంతో మార్కెట్ పరిధిలో పాటు నటుడిగా తన స్థాయిని కూడా పెంచుకుని స్టార్ హీరోగా మారిన నితిన్ ప్రస్తుతం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘లై’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. చాల వరకు అమెరికా నైపథ్యంలో నడిచే ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు విదేశాల్లోనే శరవేగంగా జరుగుతోంది. కీలక సన్నివేశాల దగ్గర్నుంచి ముఖ్యమైన ఫైటింగ్స్, పాటలు అన్నింటినీ అక్కడే చిత్రీకరిస్తున్నారు.

తాజాగా చిత్ర క్లైమాక్స్ ఎపిసోడ్ ను కాలిఫోర్నియాలో ఉన్న మొజావేలో సుమారు 1000 విమానాల మధ్య చిత్రీకరించారు. అలాగే లాస్ వేగాస్, ఎలినవేడా వంటి లొకేషన్లలో కూడా సన్నివేశాల్ని చిత్రీకరించారు. అలాగే హాలీవుడ్ స్టంట్ మాస్టర్ జెఫ్రీ ట్రాయ్, ఇండియన్ స్టంట్ కోరియోగ్రాఫర్లైన కెచ్చా, స్టన్ శివ వంటి వారి నేతృత్వంలో ఈ పోరాట సన్నివేశాల్ని తెరకెక్కించారు. జూన్ 14 వరకు జరిగే ఈ షెడ్యూల్లో ఇప్పటికే షూట్ చేసిన మూడు పాటలు కాకుండా మరొక పాటను కూడా రూపొందిస్తారట. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు