నితిన్ కొత్త చిత్రం షూటింగ్ అప్డేట్స్ !

నితిన్ కొత్త చిత్రం షూటింగ్ అప్డేట్స్ !

Published on Jan 21, 2017 4:19 PM IST

nithin
2016 లో ‘అ..ఆ’ చిత్రంతో స్టార్ హీరోల సరసన నిలబడిపోయిన హీరో నితిన్ చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే రొటీన్ కథల్ని కాకుండా భిన్నమైన సినిమాలనే ఎంచుకుంటున్నాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి భిన్నమైన చిత్రంతో ఒక ప్రత్యేకతను దక్కించుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం యొక్క కథతో పాటు హీరో నితిన్ పాత్ర, ఆహార్యం అన్నీ భిన్నంగానే ఉంటాయట. ఇందులో నితిన్ పాతబస్తీకి చెందిన ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా సరికొత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇకపోతే ఈ మధ్యనే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెండవ షెడ్యూల్ చంచల్ గూడ జైల్లో జరుగుతోంది. అక్కడే హీరో నితిన్, కమెడియన్ పృథ్వి, మరొక నటుడు బ్రహ్మాజీ పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇంకొన్ని రోజులు అక్కడే షూట్ జరగనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గోపిచంద్ ఆంచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఈ వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు