నితిన్ సినిమా అంతా విదేశాల్లోనే !

నితిన్ సినిమా అంతా విదేశాల్లోనే !

Published on Mar 1, 2017 5:53 PM IST


‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి, తన కొత్త సినిమాను హీరో నితిన్‌తో చేస్తోన్న విషయం తెలిసిందే. ‘అ..ఆ..’ లాంటి మంచి విజయం తర్వాత ఆ స్థాయికి తగ్గ సినిమాయే చేయాలన్న ఆలోచనతో నితిన్, హను రాఘవపూడితో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కోసం జత కట్టారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో యూఎస్ వెళ్లనుంది.

సుమారు 60 రోజుల వరకు జరగనున్న ఈ యూఎస్ షెడ్యూల్లోనే సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నితిన్ సరసన నూతన నటి మేఘా ఆకాష్ హీరోయిన్ గానటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేయాలనే యోచనలో ఉన్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో నితిన్ పూర్తిగా సరికొత్త, భిన్నమైన లుక్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు