నవంబర్ లో బన్ని సినిమాకు డేట్స్ కేటాయించిన నిత్యా మీనన్.

నవంబర్ లో బన్ని సినిమాకు డేట్స్ కేటాయించిన నిత్యా మీనన్.

Published on Oct 24, 2014 3:50 PM IST

Nithya-Menen
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న తాజా సినిమాలో ఒక హీరోయిన్ గా నిత్యా మీనన్ ఎంపిక దాదాపు ఖాయమైనట్టే. సమంత, ఆదా శర్మలతో పాటునిత్యా మీనన్ కూడా బన్నీతో రొమాన్స్ చేయబోతుంది. వచ్చే నెలలో త్రివిక్రమ్ సినిమా కోసం నిత్యా మీనన్ డేట్స్ కేటాయించింది అని టాక్. నవంబర్ మూడవ వారం నుండి షూటింగ్ లో జాయిన్ అవుతుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా నటిస్తున్నాడట. ‘జులాయి’ తర్వాత త్రివిక్రమ్, శ్రీనివాస్ కలసి చేస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. సీనియర్ హీరోయిన్ స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ‘జులాయి’ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు