త్రివిక్రమ్ సినిమాలో ప్రణీత స్థానంలో నిత్యామీనన్?

త్రివిక్రమ్ సినిమాలో ప్రణీత స్థానంలో నిత్యామీనన్?

Published on Oct 21, 2014 10:57 PM IST

Nithya-Menen
త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల సినిమా చాన్నాళ్ళ తరువాత షూటింగ్ మొదలై శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో మూడవ హీరోయిన్ ఇంకా ఖరారుకాలేదని సమాచారం. ముందుగా ఈ పాత్రకు ప్రణీతని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నా తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఆ పాత్రకు ఇప్పుడు నిత్యా మీనన్ పై దృష్టిపెట్టినట్టు సమాచారం.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ఈ చిత్రంలో సమంతా, అదా శర్మ మరియు నిత్యాలతో అల్లు అర్జున్ రోమాన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి సినిమా విజయవంతం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో వున్నాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు