యంగ్ హీరో సరసన నివేత థామస్ !

యంగ్ హీరో సరసన నివేత థామస్ !

Published on Jan 19, 2018 10:05 AM IST


‘గీతాంజలి, ఎక్కడికి పోతావు చిన్నవాడ, సుప్రీమ్’ వంటి చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన సాయి శ్రీరామ్ దర్శకుడిగా మారుతూ ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. యంగ్ హీరో నాగ శౌర్య ఈ చిత్రంలో హీరోగా నటించనున్నాడు. లవ్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో నివేతా థామస్ హీరోయిన్ గా నటించనుంది.

సెలెక్టివ్ గా సినిమాలకి సైన్ చేసే నివేతా శ్రీరామ్ రాసిన తన పాత్ర, సినిమా కథ నచ్చడంతో వెంటనే డేట్స్ ఇచ్చారట. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై మన్యం విజయ్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనేది త్వరలోనే తెలియనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు