తెలుగులో మంచి అవకాశం వదులుకున్న మలయాళం స్టార్ హీరో !

రామ్, శ్రీ విష్ణు హీరోలుగా, లావణ్య త్రిపాఠి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగి’. స్రవంతి మూవీస్ బ్యానర్ లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవి అందించిన సంగీతం బాగా క్లిక్ అవడంతో, సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన శ్రీ విష్ణు కు ముందు ఈ పాత్ర కోసం మలయాళం స్టార్ నివిన్ పౌలీని అనుకున్నారు. ఆయనకు కథ కూడా చెప్పారు. సబ్జెక్టు నచ్చిన నివీన్ ముందుగా చెయ్యడానికి అంగీకరించాడు. కానీ తర్వాత కొంతకాలం ఆగాలి అన్నాడట. ఎందుకంటే … అతను అంతకుముందే కమిట్ అయిన సినిమాలు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి. కానీ నివిన్ కోసం వెయిట్ చేస్తే సినిమా ఆలస్యం అవుతుందని శ్రీ విష్ణు ను సంప్రదించడం ఆయన వెంటనే ఓకే చెయ్యడంతో సినిమా మొదలవడం, పూర్తై రిలీజుకు సిద్దమవడం జరిగిపోయాయి.

 

Like us on Facebook