రామ్ చరణ్ ఆ సినిమాలో నటించడంలేదట !

ram-charan-about-baahubali
గత కొన్ని రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కొన్ని వార్తలు సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి. క్రికెటర్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్ఎస్ ధోని – ది ఆన్ టోల్డ్ స్టోరీ’ చిత్రంలో చెర్రీ ధోనీ స్నేహితుడు, సహచర ఆటగాడు అయిన సురేష్ రైనా పాత్రలో నటిస్తున్నాడని అన్నారు. అభిమానులకు సర్ ప్రైజ్ ఉంటుందని ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదని కూడా అన్నారు. కానీ ఈ వార్తలో ఎంత నిజముందో తెలీక మెగా అభిమానాలు కాత్స కన్ఫ్యూజన్ కు గురయ్యారు.

ఇప్పుడు వారందరికీ క్లారిటీ ఇస్తూ చరణ్ మేనేజర్ ఎమ్ఎస్ ధోని చిత్రంలో చరణ్ ఎలాంటి పాత్రలోనూ నటించడం లేదని, అసలు ధోని టీమ్ తమను కలవని లేదని చెప్పారు. దీంతో ఇన్నిరోజులు సాగిన సస్పెన్స్ తొలగిపోయినట్లైంది. ఇకపోతే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చరణ్ నటిస్తున్న ధ్రువ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. అలాగే ‘ఎమ్ఎస్ ధోని – ది ఆన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం ఈనెల 30న విడుదలకానుంది.

Bookmark and Share