పవన్ సినిమా విషయంలో ఎలాంటి ఆలస్యం లేదట !


ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యధిక క్రేజ్ కలిగిన చిత్రం పవన్ – త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్. వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాతో పవన్ ఇండస్ట్రీ రికార్డుల్ని క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తుండగా చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ తారా స్థాయిలో జరుగుతోంది. చాలా ఏరియాల్లో చిత్ర హక్కులు రికార్డ్ ధర పలుకుతున్నాయి. ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందని, కాబట్టి సంక్రాంతి రిలీజ్ ఉండకపోవచ్చని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా అలాంటిదేం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇకపోతే వచ్చే వారం చిత్ర టీమ్ యూరప్ షెడ్యూల్ కు వెళ్లనుంది. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటల్ని కూడా చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్లో పవన్ తో పాటు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు కూడా పాల్గొననున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉంది.

 

Like us on Facebook