మరేం పర్లేదు బన్నీ బాగానే ఉన్నాడు !

మరేం పర్లేదు బన్నీ బాగానే ఉన్నాడు !

Published on Mar 26, 2017 5:31 PM IST


అల్లు అర్జున్ హరీష్ శంకర్ డైరెక్క్షన్లో నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. అయితే గత రెండు మూడు రోజులుగా బన్నీకి ఆరోగ్యం సరిగా లేదని, ఆయన ముఖం మీద రాషెస్ లాంటివి వచ్చాయని,అందుకే సినిమా షూటింగ్లో పాల్గొనలేకపోతున్నారని వార్తలొచ్చాయి. ఇంకొన్ని మీడియా ఛానెల్స్ అయితే బన్నీ ఆరోగ్యం కుదుటపడేవరకు షూటింగ్ ఆగిపోతుందని కనుక మే నెలలో విడుదలకావాల్సిన సినిమా జూన్ కు వాయిదాపడిందని ప్రచురించారు.

కానీ తాజాగా బన్నీ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, అనుకున్న ప్రకారమే షూటింగ్ జరుగుతోంది, ఇవన్నీ ఒట్టి పుకార్లేనని తేలింది. అంతేగాక సినిమా ముందుగా ప్రకటించిన సమయానికే విడుదలవుతుందని కూడా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ రికార్డ్ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బన్నీ రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు