‘ముకుంద’లో మరో మెగా హీరో లేరు – వరుణ్ తేజ్

‘ముకుంద’లో మరో మెగా హీరో లేరు – వరుణ్ తేజ్

Published on Dec 23, 2014 8:30 AM IST

varun-tej

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ముకుంద’. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మెగా వారసుడి తొలి సినిమాగా ‘ముకుంద’పై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో మరో మెగా హీరో అతిధి పాత్రలో కనువిందు చేయనున్నారు అని ప్రచారం జరిగింది. అటువంటిది ఏమి లేదని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఎవరూ అతిధి పాత్ర చేయలేదని చెప్పారు.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త భిన్నంగా ‘ముకుంద’ ఉంటుంది. ఇదొక కొత్త తరహా ప్రయోగం. సినిమా తెరకెక్కించిన విధానం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి సీనియర్ నటులతో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి. అని వరుణ్ తేజ్ తెలిపారు.

వరుణ్ తేజ్ సరసన పూజా హెడ్గే జంటగా నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. మిక్కి జె మేయర్ సంగీత దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా తెరకెక్కింది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు