‘బాహుబలి-2’ విడుదల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం !

‘బాహుబలి-2’ విడుదల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం !

Published on Apr 26, 2017 5:45 PM IST


‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ చూస్తే ఏప్రిల్ 28 సినిమా విడుదలనాడు వాతావరణం ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అన్ని థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం పండుగను తలపించడం ఖాయం. ఈ అంశాన్నే గమనించిన తెలంగాణ ప్రభుత్వం 28 వ తేదీన దాదాపు నగరంలోని అన్ని సినిమా హాళ్లలో ఈ సినిమా విడుదలవుతుండటంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది.

అందులో భాగంగానే భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని 27 అర్థరాత్రి స్పెషల్ ప్రీమియర్ షోలకు కూడా అనుమతివ్వలేదు. అలాగే సినిమా హాళ్ల యాజమాన్యాలు నిర్దేశిత ధరలకు మించి టికెట్ల అమ్మకాలను కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆంక్షలతో పాటే సినిమా వసూళ్లకు సహకరించేలా రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు