వెంకీకి పాపులారిటీ తగ్గిందా ?

వెంకీకి పాపులారిటీ తగ్గిందా ?

Published on Mar 27, 2017 4:57 PM IST


విక్టరీ వెంకటేష్ నటించిన ‘గురు’ చిత్రం ఈ నెలాఖరు 31వ తేదీన రిలీజ్ కానుంది. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెల మొదట్లో విడుదలచేయాలని అనుకున్నా తర్వాత మార్చి 31కి ఫిక్సయ్యారు నిర్మాతలు. ఆరంభమైన మొదట్లో ఈ సినిమా గురించిన టాక్ బాగానే ఉండేది. అందరూ వెంకీ లుక్ చూసి సూపర్ అన్నవాళ్ళే. కానీ నెమ్మదిగా పలు కారణాల వలన సినిమా వాయిదాలు పడుతూ వస్తుండంతో జనాల్లో క్రేజ్ కాస్త తగ్గుముఖం పట్టింది. మొదట రెండు వాయిదాల వరకు సినిమా ఎప్పుడు.. సినిమా ఎప్పుడు అనే ఆసక్తి చూపిన ప్రేక్షకులు తర్వాత ఆ.. రిలీజైనప్పుడే చూద్దాం లే అనే మూడ్లోకి వెళ్లిపోయారు.

దీంతో చిత్ర ట్రైలర్, పాటలు అన్నీ బాగానే ఉన్నా కూడా ఆశించిన క్రేజ్ అయితే రాలేదు. సాధారణంగా సీనియర్ హీరో చిత్ర ట్రైలర్ అంటే భారీ స్థాయి హడావుడి ఉంటుంది. కానీ జనాల అనాసక్తి వలన ఆ హడావుడి ‘గురు’ కు దొరకలేదు. మరోవైపు చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లలో కొత్త తరహా పద్దతులేవీ పాటించడంతో అవి కూడా అవసరమైన అటెంక్షన్ తీసుకురాలేకపోతున్నాయి. పైగా సినిమా ఇప్పటికే హిందీ, తమిళ భాషల్లో రూపొంది ఉండటంతో సినీ లవర్స్ చాలా మంది మునుపే సినిమాను వీక్షించి ఉండటం, ఇక చూడని వాళ్లలో చాలా మంది వెంకీ రీమేక్ చేస్తున్నాడు అనగానే వెతుక్కుని మరీ చూసేయడం కూడా సినిమాపై ఉత్సుకత సన్నగిల్లడానికి కారణాలు. మరి ఇన్ని పరికూల పరిస్థితుల నడుమ ఇంకో మూడు రోజుల్లో థియేటర్లలోకి దిగుతున్న ‘గురు’ ఏ స్థాయి పంచ్ లు కొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు