‘ఇజం’ ట్రైలర్ లేనట్లేనా?
Published on Oct 16, 2016 7:58 pm IST

ism
తెలుగులో దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలంటే పడి చచ్చే అభిమానులున్నారు. మళ్ళీ మళ్ళీ చూడదగ్గ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన పూరీకి, హీరోలను కొత్తగా పరిచయం చేయడం, ఇంటెన్సిటీ ఉన్న డైలాగులు రాయడం లాంటివి ఒక అలవాటుగా మారిపోయాయి. అదే పంథాను కొనసాగిస్తూ నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌ను సరికొత్త లుక్‌లో పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన ‘ఇజం’ అనే సినిమా మరో ఐదు రోజుల్లో థియేటర్లలో వాలిపోనుంది.

పోస్టర్స్, టీజర్‌తోనే అంచనాలను తారాస్థాయికి చేర్చిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక కూడా ఈ మధ్యే వైభవంగా జరిగింది. అయితే సాధారణంగా అన్ని ఆడియో వేడుకల్లో ట్రైలర్ విడుదల చేపట్టినట్లుగా ఇజం విషయంలో అలా జరగలేదు. ఇజం ట్రైలర్ ఎప్పుడొస్తుందన్నది కూడా టీమ్ స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ఇంకా ఐదు రోజులో సమయం ఉన్న ఈ పరిస్థితుల్లో ఇక ట్రైలర్ విడుదల కాకపోవచ్చనే వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‍గా నటించారు.

 
Like us on Facebook