‘ఖైదీ నెం. 150’కి ట్రైలర్ ఉండదా..?

khaidi150-1
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నెం. 150’ కోసం ఆయన అభిమానులంతా ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తారాస్థాయి అంచనాల మధ్యన జనవరి 11న విడుదలవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున చేపట్టారు. కాగా విడుదలకు ఇంకా వారం రోజులు కూడా లేని ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ ట్రైలర్ విడుదల కాకపోవడమన్నది ఆశ్చర్యకరంగా మారింది. ఎప్పట్నుంచో ట్రైలర్ రిలీజ్ ఈ రోజు ఉంటుందీ, ఆ రోజు ఉంటుందీ అని చెబుతూ వచ్చినా అవన్నీ గాలి వార్తలుగానే నిలిచాయి.

ఇక ఈనెల 7న పెద్ద ఎత్తున జరగనున్న ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్ విడుదలవుతుందన్న ప్రచారం వినిపిస్తున్నా, ఆ రోజు కూడా ట్రైలర్ విడుదలవ్వదని, అసలు సినిమాకు ట్రైలర్ అన్నదే ఉండదన్న మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. మరి ట్రైలర్ రిలీజ్ లేకుండా నేరుగా సినిమాతోనే వచ్చే సాహసం చేస్తారా? అన్నది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించారు.

 

Like us on Facebook