విశ్వరుపానికి ఎటువంటి ఇబ్బందులూ లేవు – కమల్

విశ్వరుపానికి ఎటువంటి ఇబ్బందులూ లేవు – కమల్

Published on Aug 22, 2014 11:42 PM IST

kamal-haasan
కమల్ నటిస్తున్న విశ్వరూపం 2 సినిమా చాలా రోజులుగా నిర్మాణదశలో వుంది. కమల్ ఈ చిత్రాన్ని మొదటి భాగంతో పాటే తెరకెక్కినా ఇంకా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తుంది. ఈ సినిమా విడుదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని కమల్ ని ప్రశ్నించగా దానికి ఈ విలక్షణ నటుడు అటువంటిది ఏమి లేదని, ఈ చిత్రం విడుదల సాఫీగా జరుగుతుందని వెల్లడించారు

మొదటి భాగంలో నటీనటులే ఈ సినిమాకు సైతం కొనసాగిస్తున్నారు. ఘిబ్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ చిత్రానికంటే ముందు కమల్ నటించిన ‘ఉత్తమ విలన్’ విడుదల అవుతుందని సమాచారం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు