పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ అది కాదు !

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ అది కాదు !

Published on Oct 26, 2016 3:16 PM IST

pawan-kalyan-trivikram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమాని ఒకే చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు నవంబర్ 5ను ముహుర్తనగా ఫిక్స్ చేశారు కూడా. దీంతో ఈ సినిమాపై అప్పుడే సోషల్ మీడియాలో రూమర్లు మొదలయ్యాయి. ముఖ్యంగా సినిమా టైటిల్, హీరోయిన్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట ఈ సినిమాకి ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్ నిర్ణయించారని అన్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా అదే అసలైన టైల్ అనుకుని సంబరపడ్డారు.

కానీ పవన్, త్రివిక్రమ్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా టైటిల్ ‘దేవుడే దిగివచ్చినా’ కాదని, అసలు ఇంకా టైటిల్ ను నిర్ణయించనే లేదని తేల్చిచెప్పారు. అలాగే ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ అంటూ పలువురి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. వాటిలో కూడా వాస్తవం లేదని హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదని తెలిపారు. ఇకపోతే జనవరి నెల నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు