వర్మపై నాన్-బెయిలబుల్ వారెంట్ !

వర్మపై నాన్-బెయిలబుల్ వారెంట్ !

Published on Apr 28, 2017 2:15 PM IST


స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఏకంగా ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. వివరాల్లోకి వెళితే 2009 లో వర్మ ‘అగ్యాత్’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ ఆ సినిమా కథ తనదంటూ రచయిత సిద్ధిక్ ముస్తాక్ ముహసిన్ అప్పట్లో కోర్టులో కేసు వేశారు. తాను ఒక కథను తయారు చేసి వర్మకు పోస్ట్ చేశానని కానీ వర్మ నుండి తనకు ఎలాంటి సమాధానం రాలేదని, తీరా 2009లో ఆయన చేసిన ‘అగ్యాత్’ సినిమా చూస్తే అది తన కథేనని అర్థమయిందని అన్నారు.

కానీ సినిమా టైటిల్స్ లో తన పేరు ఎక్కడా కనబడలేదని, ఆ కథను తాను ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ కూడా చేయించానని అంటూ అప్పుడే కోర్టులో కేసు వేశారు. ఆ కేసును విచారణనకు స్వీకరించిన న్యాయస్థానం గత రెండేళ్లలో పలు సార్లు వివరణ ఇవ్వాలని వర్మకు సమన్లు పంపింది. కానీ వర్మ వాటిపై స్పందించకపోవడంతో కోర్టు ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి ఈ వివాదంలో వర్మ నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు