హాలీవుడ్ వెళ్ళే ఆలోచన లేదన్న రాజమౌళి!

హాలీవుడ్ వెళ్ళే ఆలోచన లేదన్న రాజమౌళి!

Published on May 3, 2016 7:48 PM IST

rajmouli
దర్శక ధీరుడు రాజమౌలి సృష్టించిన ప్రభంజనమైన ‘బాహుబలి’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాక, పలు ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇక సినిమాల పరంగా భారతదేశంలోనే అత్యుత్తమ అవార్డులుగా భావించే జాతీయ అవార్డుల్లో 2015 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ఈ సాయంత్రం ఢిల్లీలో వైభవంగా జరగనుంది. ఇక ఈ వేడుకలో అవార్డు స్వీకరించేందుకు రాజమౌళి, తన టీమ్‌తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా అక్కడి మీడియా త్వరలోనే హాలీవుడ్‌కి వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత? అని అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా, ప్రస్తుతానికి తాను ‘బాహుబలి 2’తో పాటు ఇప్పటికే కమిటై ఉన్న కొన్ని సినిమాలను పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటికైతే హాలీవుడ్ వెళ్ళే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా గతేడాది జూలై 10న విడుదలై ఇండియన్ సినిమాలో సంచలనంగా మారిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు