జీవిత ఖైదుకు గురైన నిర్మాత !

జీవిత ఖైదుకు గురైన నిర్మాత !

Published on May 24, 2017 4:47 PM IST


మాజీ ఎమ్మెల్యే, చిత్ర నిర్మాత అయిన చెంగల వెంకట్రావ్ కు కోర్టు జీవిత ఖైదును విధించింది. దాదాపు దశాబ్ద కాలం క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఆయనకు అనకాపల్లి సెషన్స్ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే 2007 లో విశాఖపట్నంలోని పాయకరావు పేట ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావ్ బీచ్ మినరల్స్ కంపెనీ వివాదంలో కొండా అనే మత్య్సకారుడ్ని ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయించినట్టు
ఆరోపణలు ఎదుర్కొన్నారు.

దాదాపు పదేళ్ల పాటు కేసును విచారించిన కోర్టు ఆయనతో పాటు మరో 15 మందికి జీవిత ఖైదును, మరో ఐదుగురుకు రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పు రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనం రేపింది. వెంకట్రావ్ గతంలో నందమూరి బాలకృష్ణతో 1999లో ‘సమరసింహారెడ్డి’, జూ. ఎన్టీఆర్ తో 2005లో ‘నరసింహుడు’ వంటి చిత్రాల్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు