ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్

ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్

Published on May 23, 2015 8:55 PM IST

Kailash-Kher
ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ నిన్న న్యూయార్క్ నుండి ఇండియా వస్తున్న క్రమంలో ముంబాయిలో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయాన్ని కైలాష్ ఖేర్ స్వయంగా తన సోషల్ నెట్వర్కింగ్ పేజ్ లో వెల్లడించాడు. ఆసుపత్రి పాలవ్వడానికి గల కారణం తెలుపలేదు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోకపోవడం వలన ఎవరూ రావలనుకొని స్థానానికి వచ్చానని చురక కూడా వేసాడు.

అరుంధతి సినిమాలో ‘కమ్ముకున్నా చీకట్లోనా’ పాటతో ఫేమస్ అయిన కైలాష్ ఖేర్ మిర్చిలో ‘పండగలా దిగివచ్చాడు’ సినిమాతో సెలబ్రిటీగా మారిపోయాడు. దాదాపు 20 భాషలలో 500కి పైగా పాటలను పాడాడు. కైలాష్ చివరిగా గోపాల గోపాల చిత్రంలో ‘ఎందుకో ఎందుకో’ పాటను పాడాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు