కళ్యాణ్ రామ్ సినిమా కోసం తమిళ రచయితలు !

కళ్యాణ్ రామ్ సినిమా కోసం తమిళ రచయితలు !

Published on May 25, 2017 4:35 PM IST


కొత్త దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించనున్నాడు. ఈ చిత్రం జూన్ లో ప్రారంభంకానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తమిళ పాపులర్ రచయితలు పనిచేయనున్నారు. తమిళ రచయితలు సురేష్ సుభా ఈ చిత్రానికి రచనా సహకారం అందించనున్నారు.

గతంలో వీరు తనీఒరువన్, కావాన్, ఐ మరియు అనేగన్ చిత్రాలకు రచయితలుగా పనిచేసారు. కాగా తొలిసారి వీరిద్దరూ తెలుగు చిత్రానికి రచయితలుగా పనిచేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు