మహేష్ సినిమాను ప్రశంసించిన తారక్

మహేష్ సినిమాను ప్రశంసించిన తారక్

Published on Apr 22, 2018 6:07 PM IST

భరత్ అనే నేను బహిరంగ సభకు జూనియర్ ఎన్టీఆర్ అతిధిగా రాగానే ఒక్కసారిగా క్రేజ్ ఎక్కువైందనే చెప్పాలి. అసలే మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఉన్నారు. ఇక తారక్ అభిమానులు కూడా భరత్ అనే నేను సినిమాకు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కూడా చేశారు. ఇద్దరు ఒకే వేదికపై కనిపించిన సందర్భం ఎంతగానో ఆకట్టుకుంది. అప్పుడు తారక్ మహేష్ ను మహేష్ అన్నా అని పిలుస్తానని చెప్పడం వంటి విషయాలు అందరిని ఆకర్షించాయి.

అయితే రీసెంట్ గా తారక్ భరత్ అనే నేను సినిమాను చూసి ట్విట్టర్ ద్వారా స్పందించారు. మంచి సోషల్ మెస్సేజ్ తో పాటు కమర్షియల్ హంగులను జోడించి ఒక సినిమాను తెరకెక్కించడం అంత తేలిక కాదు. దర్శకుడు కొరటాల శివ ఆ రెండు విషయాలను చాలా సమానంగా చూపించాడు. మహేష్ బాబు నటనకూడా చాలా బావుందని తారక్ ప్రశంసించాడు. అంతే కాకుండా చిత్ర యూనిట్ మొత్తానికి తారక్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు