వాయిదాపడిన ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ !

వాయిదాపడిన ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ !

Published on Jan 16, 2018 5:24 PM IST

ప్రముఖ దర్శకుడు తేజ ప్రస్తుతం దివంగత మహానటుడు నందయూరి తారకరామారావుగారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఒక సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం టీజర్ నిమిత్తం షూటింగ్ కూడా జరుపుకుంది.

ఈ టీజర్ ను జనవరి 18 ఎన్టీఆర్ వర్థంతినాడు రిలీజ్ చేయాలని భావించిన యూనిట్ ఇప్పుడు వర్థంతినాడు విడుదలచేయడం ఎందుకని వాయిదావేశారట. అలాగే టీజర్ ఈ నెలలోనే ఉంటుందని, కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్న బాలక్రిష్ణ సినిమాలో అనేక రకాలైన గెటప్స్ లో కనిపిస్తారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు