పోలీస్ స్టేషన్ లో రభస చేస్తున్న ఎన్.టి.ఆర్

పోలీస్ స్టేషన్ లో రభస చేస్తున్న ఎన్.టి.ఆర్

Published on Oct 24, 2014 6:30 PM IST

Jr-NTR-Police
12 రోజులు వర్కర్స్ యూనియన్ స్ట్రైక్ వల్ల ఆగిపోయిన యంగ్ టైగర్ఎన్.టి.ఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమా మళ్ళీ రీ స్టార్ట్ అయ్యింది. ఈ రోజు ఉదయం నుంచి హైదరబాద్ బేగం పెట్ లోని గులాబీ హౌస్ లో వేసిన పోలీస్ స్టేషన్ సెట్లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఎన్.టి.ఆర్ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

స్ట్రైక్ వల్ల ఈ నెల 20న మొదలు కావాల్సిన గోవా షెడ్యూల్ ఆగిపోయింది. ముందుగా ఈ చిత్ర టీం రేపటి నుంచి గోవా షెడ్యూల్ చెయ్యాలని అనుకున్నారు, కానీ అనుకున్నన రిలీజ్ డేట్ కి తక్కువ సమయం ఉండడటం వలన ఒక్క రోజు కూడా వృధా కాకూడదని హైదరబాద్ లోనే షూటింగ్ మొదలు పెట్టేసారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక గోవా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ‘బాద్షా’ తర్వాత ఎన్.టి.ఆర్ తో చేస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు