ఎన్టీఆర్, చరణ్ మల్టీ స్టారర్ సినిమా ప్రకటన !

ఎన్టీఆర్, చరణ్ మల్టీ స్టారర్ సినిమా ప్రకటన !

Published on Mar 22, 2018 6:50 PM IST

రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్, చరణ్ నటించనున్న సినిమాను అనౌన్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ ట్యాగ్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పేర్లు వచ్చేలా సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అక్టోబర్ నుండి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఇద్దరు హీరోలు ఈ మూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమా ఫోటో షూట్ కోసం లాస్ ఏంజెల్స్ కు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం చరణ్ బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. వచ్చే నెల నుండి ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక ఇద్దరు హీరోలు రాజమౌళి సినిమాలో నటిస్తారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సినిమాను అనౌన్స్ చెయ్యడంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో కొరకు క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు