సెప్టెంబర్ 26 నుండి ఎన్టీఆర్ – పూరి సినిమా…

సెప్టెంబర్ 26 నుండి ఎన్టీఆర్ – పూరి సినిమా…

Published on Sep 22, 2014 10:26 PM IST

jr-ntr-puri-jaganath
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా సెకండ్ షెడ్యూల్ వచ్చే శుక్రవారం, సెప్టెంబర్ 26 నుండి ప్రారంభం అవుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో ఎన్టీఆర్ మరియు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. గతంలో ఈ సినిమా ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలకు నిర్మాత బండ్ల గణేష్ చెక్ పెట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హాస్య నటుడు సప్తగిరి ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందించారు. మాటలు, స్క్రీన్ ప్లే లను పూరి జగన్నాధ్ సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు