అభిమానులతో స్పెషల్ ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్..?

అభిమానులతో స్పెషల్ ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్..?

Published on Oct 2, 2014 1:45 AM IST

ntr
కష్టకాలంలో కూడా తన వెన్నంటే ఉన్న అభిమానుల కోసం ఏదైనా చేయాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు. ఇటివల ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఆశించిన రీతిలో విజయం సాధించలేదు. అభిమానులు తమ ఫేవరెట్ హీరోపై ఆదరాభిమానాలు చూపిస్తూ వచ్చారు.

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ అభిమానులతో స్పెషల్ ఫోటోషూట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. విశాఖపట్టణంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్టీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యె ఈ కార్యక్రమం జరిగే ప్రదేశం, తేది వివరాలు అభిమానులకు తెలియజేస్తారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు