ఎన్టీఆర్, సమంతల కాంబోలో మరో సినిమా?

ఎన్టీఆర్, సమంతల కాంబోలో మరో సినిమా?

Published on Nov 27, 2015 10:50 AM IST

ntr-samtha

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సౌత్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతోన్న సమంతల కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలతో మెప్పించిన ఈ జంట తాజాగా మరోసారి మెప్పించేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ‘శ్రీమంతుడు’ తర్వాత టాలీవుడ్‌లో టాప్ దర్శకుల్లో ఒకరుగా చేరిపోయిన కొరటాల శివ, తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందననున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండగా తిరు, దేవిశ్రీప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్స్‌కి తోడు సమంత కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు వార్త రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు సమంతను కొరటాల శివ సంప్రదించగా, కథ విన్న ఆమె వెంటనే ఈ ప్రాజెక్టును ఓకే చేసేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తోన్న ‘నాన్నకు ప్రేమతో’ పూర్తయ్యాక కొరటాల శివ సినిమాను మొదలుపెట్టనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు