స్పెయిన్ లో తారక్ – సుకుమార్ ల సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్

స్పెయిన్ లో తారక్ – సుకుమార్ ల సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్

Published on Apr 1, 2015 2:00 AM IST

NTR-Sukumar11
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్ లో రానున్న ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభంకానుంది. ఈ సినిమాకు ‘దండయాత్ర’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రకు జగపతిబాబుని ఎంపిక చేసుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం సుకుమార్ మరియు సంగీత దర్శకుడు దేవి తన బృందంతో కలిసి స్పెయిన్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కి వెళ్ళారు. ఈ సినిమాకి బాణీలు సమకూర్చే పనిలో ఏప్రిల్ 9వరకూ అక్కడే గడపనున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ అనే పుకారుని స్వయంగా ఆమే కొట్టిపారేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు