దండయాత్ర : టైటిల్ వేటలో ఎన్టీఆర్-సుకుమార్!

దండయాత్ర : టైటిల్ వేటలో ఎన్టీఆర్-సుకుమార్!

Published on Mar 29, 2015 4:26 PM IST

NTR_Sukumar1
‘టెంపర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన తరువాతి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. సరికొత్త కథాంశాలు, మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో తెలుగులో టాప్ డైరెక్టర్‌‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న సుకుమార్, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ‘1 నేనొక్కడినే’ తర్వాత సుకుమార్ స్థాయి మరింత పెరిగింది. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా, సుకుమార్ అనితరసాధ్య ప్రతిభను మాత్రం చాటిచెప్పింది. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాని అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు ఓ మంచి టైటిల్ పెట్టడం విషయమై సినిమా యూనిట్ భావిస్తోంది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు ‘దండయాత్ర’ అనే పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ‘ఇది దండయాత్రా.. దయాగాడి దండయాత్రా..’ అంటూ ఎన్టీఆర్ టెంపర్‌లో చెప్పిన డైలాగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే! అందరి నోళ్ళలో నానుతున్న ఈ పేరునే సినిమాకు పెట్టడం బాగుంటుందని సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ టైటిల్ దాదాపుగా అందరికీ ఓకే అయినట్టు సమాచారం. ఇక ఏప్రిల్ 17న లండన్‌లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా మరో కొత్త గెటప్‌లో దర్శనమివ్వనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు