నిజాయితీగల పోలీస్ గా తారక్

నిజాయితీగల పోలీస్ గా తారక్

Published on Sep 24, 2014 12:11 AM IST

Jr-NTR-Police
పూరి జగన్నాద్ దర్శకత్వంలో వస్తున్న ఎన్.టి.ఆర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. సెప్టెంబర్ 26 నుండి రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా హీరో, విలన్ల మధ్య ముఖ్యసన్నివేశాలను చిత్రీకరించనున్నారు

నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో తారక్ మనల్ని అలరించనున్నాడు. నిజాయితీతో పాటు హీరోకి పూరి మార్కు యాటిట్యూడ్ సైతం వుండడం షరా మమోలే. బండ్ల గణేష్ ఈ సినిమాకు నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్

చాలా సినిమాలుగా మంచి హిట్ పడని తారక్ కు ఈ సినిమాలో పాత్ర చిత్రీకరణ వైవిధ్యంగా వుంటుందని తెలిసింది. ఈ అంశం ఎంతవరకూ కలిసివస్తుందో చూడాలి. తప్పకుండా అభిమానులను, ప్రేక్షకులను తారక్ ఈసారి అలరిస్తాడని నమ్మకంగా వున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు