స్టార్ హీరో కోసం ఎన్టీఆర్ పాట పాడతాడా ?

స్టార్ హీరో కోసం ఎన్టీఆర్ పాట పాడతాడా ?

Published on Feb 19, 2020 8:53 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో సింగర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ కొన్ని పాటలు కూడా పాడాడు. అందులో కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో సినిమాలో కూడా ఎన్టీఆర్ ఓ పాట పాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా ఎన్టీఆర్‌ తో ఒక సాంగ్ పాడించాలని ‘మాస్టర్’ చిత్రబృందం తెగ ప్రయత్నిస్తుందట.

తమిళంలో విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్ లో వస్తోన్న ‘మాస్టర్‌’ సినిమాకి అనిరుధ్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే సినిమాలో ‘లెట్‌ మి సింగ్‌ ఎ కుట్టీ స్టోరీ’ అంటూ సాగే పాటను తమిళంలో హీరో విజయ్‌ చేత పాడించారు. దాంతో ఆ తమిళ్ సాంగ్ ట్రెండింగ్‌ లో ఉంది. ఇక తెలుగులో ‘మాస్టర్‌’ చిత్రాన్ని ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకం పై మహేశ్‌ కోనేరు రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ కి సన్నిహితుడైన మహేశ్‌ కోనేరు ‘కుట్టీ స్టోరీ’ తెలుగు సాంగ్ ను ఎన్టీఆర్‌ పాడితే బాగుంటుందని ఫీల్ అవుతున్నారట. మరి ఎన్టీఆర్‌ పాట పాడటానికి అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు