అతనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా విలన్ !

అతనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా విలన్ !

Published on Mar 16, 2018 2:07 AM IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని బ్యానర్ లో చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

తాజా సమాచారం మేరకు జగపతిబాబు ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చాలా సినిమాల్లో మంచి పాత్రల్లో కనిపించిన జగపతిబాబు త్రివిక్రమ్ సినిమాలో మరో విలక్షణమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ స్లిమ్ గా మారి కొత్తగా కనిపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు