ఎన్టీఆర్ లేకుండానే సినిమా షూట్ మొదలుపెట్టేస్తున్నారు !

ఎన్టీఆర్ లేకుండానే సినిమా షూట్ మొదలుపెట్టేస్తున్నారు !

Published on Feb 19, 2017 2:10 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో చేస్తున్న నూతన చిత్రం రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. అయితే ఈ షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనరని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా కోసం లుక్ ను కాస్త మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని అందుకే ఆయన మార్చి నెల నుండి షూట్లో జాయిన్ అవుతారట. కాబట్టి దర్శకుడు బాబి ఆలస్యం లేకుండా మిగిలిన నటీనటులపై రేపటి నుండి షూటింగ్ మొదలుపడతారని సమాచారం.

ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం కళ్యాణ్ రామ్ సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్, హాలీవుడ్ లో పేరు మోసిన కృత్రిమ అవయవాల సృష్టికర్త, మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ వంటి ప్రముఖ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నా చిత్ర టీమ్ నుండి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు