ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అప్డేట్ !

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అప్డేట్ !

Published on May 25, 2018 6:10 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. మొదటిసారి తారక్, త్రివిక్రమ్ కలిసి పనిచేస్తుండటంతో ఈ చిత్రం గురించి పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వేగంగా ముందుకు కదులుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొంపల్లి ప్రాంతంలో జరుగుతోంది.

సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కు కూడ సూపర్ రెస్పాన్స్ దక్కడంతో టీమ్ మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు