పూరికి ఖరీదైన బహుమతి ఇచ్చిన ఎన్.టి.ఆర్

పూరికి ఖరీదైన బహుమతి ఇచ్చిన ఎన్.టి.ఆర్

Published on Jul 24, 2014 7:00 PM IST

Puri-Cave

డైరెక్టర్ పూరి జగన్నాధ్ రెండు రోజుల క్రితమే హైదరాబాద్ లో తను ఎంతో ఇష్టపడి డిజైన్ చేసుకున్న స్టైలిష్ ఆఫీసుని ప్రారంభించాడు. ఈ ఆఫీసుకి ‘కేవ్’ అని పేరు కూడా పెట్టారు. ఆఫీసు గ్రాండ్ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని కితాబులిస్తున్నారు. ఈ ఆఫీసుకి పూరి జగన్నాధ్ కి మంచి ఫ్రెండ్ అయిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చాడు.

‘నా ఆఫీసు కోసం తారక్ ఖరీదైన కాన్సెర్ట్ స్పీకర్స్ ని బహుమతిగా ఇచ్చాడు. ఆ స్పీకర్స్ చాలా సూపర్బ్ గా ఉన్నాయి. థాంక్యూ తారక్ అని’ పూరి జగన్నాధ్ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసాడు. గతంలో ఎన్.టి.ఆర్ హరీష్ శంకర్, శ్రీను వైట్లలకు కూడా ఖరీదైన వాచ్ లను బహుమతిగా ఇచ్చాడు.

పూరి జగన్నాధ్ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా త్వరలో మొదలు కానుంది. బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది.

puri-twi

సంబంధిత సమాచారం

తాజా వార్తలు