సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తిచేయనున్న తారక్ ?

సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తిచేయనున్న తారక్ ?

Published on Mar 24, 2018 9:09 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో మొదలుపెట్టనున్నారు. చిత్రీకరణ కోసం ఇప్పటీకే భారీ సెట్ ను సైతం డిజైన్ చేస్తున్నారట.

త్వరలో ఎన్టీఆర్ రాజమౌళి చిత్ర పనుల్లో జాయిన్ కావాల్సి ఉండటంతో త్రివిక్రమ్ అండ్ టీమ్ సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు