యు ట్యూబ్ లో హిట్ అయిన ఎన్.టి.ఆర్ సినిమా

యు ట్యూబ్ లో హిట్ అయిన ఎన్.టి.ఆర్ సినిమా

Published on Apr 24, 2014 1:30 PM IST

Ramayya-Vasthavayya-1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా గబ్బర్ సింగ్ హిట్ మేజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు.

బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్ అయిన ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ ల రామయ్యా వస్తావయ్యా సినిమా యు ట్యూబ్ లో హిట్ అయ్యింది. ఫిబ్రవరిలో ఈ సినిమాని యు ట్యూబ్ లో రిలీజ్ చేసారు. అతి తక్కువ కాలంలో ఈ సినిమాకి వన్ మిలియన్ హిట్స్ ని దాటేసింది. బాక్స్ ఆఫీసు వద్ద హిట్ కొట్టలేకపోయినా యు ట్యూబ్ లో అన్నా హిట్ కొట్టారు.

ఎన్.టి.ఆర్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే త్వరలో పూరి జగన్నాధ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు