రేపటి నుంచి ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ న్యూ షెడ్యూల్

రేపటి నుంచి ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ న్యూ షెడ్యూల్

Published on Nov 26, 2014 8:21 AM IST

Ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ సినిమా కోసం గత కొద్ది వారాలు గోవాలో షూట్ చేసారు. నిన్ననే ఈ చిత్ర టీం గోవా షెడ్యూల్ పూర్తి హ్సుసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకోవడంతో ఈ చిత్ర టీం షెడ్యూల్స్ మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వడం లేదు. అందుకే రెండు రోజులు మాత్రమే గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం రేపటి నుంచి ఈ సినిమా న్యూ షెడ్యూల్ హైదరబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు కానుంది.

అనుకున్న రిలీజ్ టార్గెట్ కి తక్కువ సమయం ఉదాడంతో ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యనున్నారు. అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. వక్కంతం వంశీ అందించిన కథకి పూరి మార్క్ డైలాగ్స్ మరియు టేకింగ్ హైలైట్ అవుతాయని ఈ చిత్ర టీం అంటోంది. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు