పూర్తైన ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ గోవా షెడ్యూల్

పూర్తైన ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ గోవా షెడ్యూల్

Published on Nov 25, 2014 8:21 AM IST

ntr-purijaganth
గత కొద్ది రోజులుగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గోవాలో తన టీంతో సందడి చేస్తున్నారు. అది కూడా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్న ‘టెంపర్’ సినిమా కోసం. గత కొద్ది రోజులుగా గోవాలో డే అండ్ నైట్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా గోవా షెడ్యూల్ నిన్న రాత్రితో ముగిసింది. ఈ రోజు ఈ చిత్ర టీం తిరిగి హైదరబాద్ బయలు దేరింది.

ఈ గోవా ఎపిసోడ్ లో ఎన్.టి.ఆర్, ప్రకాష్ రాజ్, కాజల్ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ఈ చిత్ర టీం హైదరబాద్ తిరిగి వచ్చాక రెండు రోజులు గ్యాప్ తీసుకొని మరో తాజా షెడ్యూల్ ని నవంబర్ 27 నుంచి హైదరబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టనుంది. సంక్రాంతి రేసులో ఈ సినిమా ఉండడం వలన మూవీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నారు.

ఇదిలా ఆంటే మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యనున్నారు. అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. వక్కంతం వంశీ అందించిన కథకి పూరి మార్క్ డైలాగ్స్ మరియు టేకింగ్ హైలైట్ అవుతాయని ఈ చిత్ర టీం అంటోంది. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు