వాయిదాపడిన ‘ఆఫీసర్’ !
Published on May 16, 2018 11:56 am IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫెవరెట్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జునతో కలిసి చేసిన తాజా చిత్రం ‘ఆఫీసర్’. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్ని జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా మే 25వ తేదీన విడుదలచేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు అది కాస్త వాయిదాపడింది.

అందుకు కారణం సాంకేతిక అంశాలేనట. సినిమా సాంకేతికంగా గొప్పగా ఉండటం కోసం పని చేస్తుండటం వలన ఇంకొంచెం సమయం పట్టేలా ఉందని, అందుకే సినిమాను జూన్ 1కి వాయిదా వేస్తున్నామని వర్మ అధికారికంగా తెలిపారు. ఈ చిత్రంలో నాగార్జున ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటూ నమ్ముకున్న నిజం కోసం పోరాడే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా మైరా సరీన్ కథానాయకిగా నటించింది.

 
Like us on Facebook