పవన్ సినిమా ఫస్ట్ లుక్ అఫీషియల్ కన్ఫర్మేషన్ !

పవన్ సినిమా ఫస్ట్ లుక్ అఫీషియల్ కన్ఫర్మేషన్ !

Published on Aug 24, 2017 3:00 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అంశాల్లో ఆయన తర్వాతి సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు, టైటిల్ ఏమిటి అనేవి కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఎదురుచూస్తున్న అభిమానుల్ని ఇకపై వెయిట్ చేయించడం ఇష్టంలేని టీమ్ ఫిరత్ లుక్ విడుదలతేదీని ప్రకటించేసింది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్బంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇప్పటి నుండే సోషల్ మీడియాలో అభిమానుల కోలాహలం మొదలైపోయింది.

పవన్ కు బాగా కలిసొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటం వలన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంతో పవన్ పాత రికార్డుల్ని బద్దలుకొడతారని ఫ్యాన్స్, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు