‘ఓకే బంగారం’ యూఎస్ కలెక్షన్స్

‘ఓకే బంగారం’ యూఎస్ కలెక్షన్స్

Published on Apr 19, 2015 2:56 AM IST

Ok-Bangaram
చాన్నాళ్ళకు వెండితెరపై మణిరత్నం మ్యాజిక్ మళ్ళీ పనిచేసింది. గత కొంతకాలంగా తనదైన సినిమా తీయలేకపోయిన మణిరత్నం ‘ఓకే బంగారం’ సినిమా ద్వారా మళ్ళీ తానేంటో నిరూపించుకున్నారు. నిన్న (ఏప్రిల్ 17న) విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మణిరత్నం తన స్టైల్లో ఒక ప్రేమకథను తెరకెక్కిస్తే అది ఎంత అందంగా, అర్థవంతంగా ఉంటుందో తీసి చూపించారు. సహజీవనం నేపథ్యంలో నడిచే ఈ సినిమాను చాలా తెలివిగా, సున్నితంగా తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.

ఓకే బంగారం సినిమాకు ముఖ్యంగా ‘ఏ’ సెంటర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో ఈ సినిమా విడుదలైన రోజే సుమారు 50లక్షలను కొల్లగొట్టి మంచి ఓపెనింగ్స్ సాధించింది. విడుదలైన అన్ని చోట్లా ఓపెనింగ్స్ బాగున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా రావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌ల జంట ఆద్యాంతం ప్రేక్షకుడిని కట్టిపడేసింది. తారగా నటించిన నిత్యామీనన్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. ఇక ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకు మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు