బాలీవుడ్ లో ‘ఓకే బంగారం’.?

బాలీవుడ్ లో ‘ఓకే బంగారం’.?

Published on Apr 21, 2015 12:02 PM IST

Ok-Bangaram
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ మణిరత్నంకి సౌత్ లో ఎంత క్రేజ్ ఉందొ హిందీలో కూడా నాతే ఉంది. మామోలుగా మణిరత్నం తన ప్రతి సినిమాని తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా తీస్తుంటారు. కానీ అలా అయన హిందీలో తీయకుండా చేసిన లేటెస్ట్ మూవీ ‘ఓకే బంగారం/ ఓకే కన్మణి’. ఈ సినిమా గత శుక్రవారం తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవ్వడమే కాకుండా ఫుల్ పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ముఖ్యంగా ఒవర్సీన్, అర్బన్ ఏరియాలు, మల్టీ ప్లెక్స్ లో సూపర్బ్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం బాలీవుడ్ కి చెందినా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ఓకే కన్మణి రీమేక్ రైట్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతోంది. అన్నీ వర్క్ అవుట్ అయితే త్వరలో బాలీవుడ్ రీమేక్మొదలవుతుంది . మరి బాలీవుడ్ రీమేక్ ని మణిరత్నం డైరెక్ట్ చేస్తాడా లేక వేరే ఎవరన్నా చేస్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం యంగ్ జెనరేషన్ ఎక్కువ ఆసక్తి చూపుతున్న లివ్ ఇన్ రిలేషన్ షిప్ మీద ఈ సినిమాని తీసారు. ఈ కాన్సెప్ట్ బాలీవుడ్ కి బాగా కనెక్ట్ అవుతుందని కూడా పలువురు భావిస్తున్నారు. మరి దల్కేర్ సల్మాన్ – నిత్యా మీనన్ రోల్స్ ఎవరు చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు