వీక్ డేలో మల్టీ ప్లెక్సుల్లో ‘ఓకే బంగారం’ స్ట్రాంగ్ కలెక్షన్స్

వీక్ డేలో మల్టీ ప్లెక్సుల్లో ‘ఓకే బంగారం’ స్ట్రాంగ్ కలెక్షన్స్

Published on Apr 20, 2015 11:03 PM IST

Ok-Bangaram
మానవ సంబంధ బాంధవ్యాల మీద ఎక్కువగా సినిమాలు చేసే సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం చాలా సంవత్సరాల తర్వాత ‘ఓకే కన్మణి/ఓకే బంగారం’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఫుల్లీ క్లాస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మల్టీ ప్లెక్స్, ఎ సెంటర్స్, అర్బన్ ఏరియాల్లో మరియు ఓవర్సీస్ లో సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా ఓవర్సీస్ లో తెలుగు, తమిళ భాషల్లో కలిపి 3.27 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి క్లాస్ ఆడియన్స్ లో వచ్చిన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వల్ల వీక్ డే అయిన సోమవారం కూడా మల్టీ ప్లెక్స్, ఏ సెంటర్స్, అర్బన్ ఏరియాల్లో మరియు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఓకే బంగారం బాక్స్ ఆఫీసు ని రూల్ చేస్తోంది. ఇది బి, సి ఆడియన్స్ ని పెద్దగా మెప్పించే సినిమా కాదు కావున అక్కడ మాత్రం కలెక్షన్స్ కాస్త డల్ గానే ఉన్నాయి. దల్కేర్ సల్మాన్ – నిత్యా మీనన్ ల కెమిస్ట్రీ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అయ్యింది. అలాగే ఫస్ట్ హాఫ్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ – పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు