కలెక్షన్స్ లో ఫుల్ పికప్ అందుకున్న ‘ఒక లైలా కోసం’

కలెక్షన్స్ లో ఫుల్ పికప్ అందుకున్న ‘ఒక లైలా కోసం’

Published on Oct 19, 2014 8:34 PM IST

okalila-kosam
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా పరిచయం అయిన సినిమా ‘ఒక లైలా కోసం’. ఈ సినిమా సోలోగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి డీసెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా పెరిగాయి. శుక్రవారం కంటే శని వారం, ఆదివారాలు కలెక్షన్స్ మరింత పెరిగాయి.

ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 70% కలెక్షన్స్ ని రాబట్టుకుంటే శనివారం, ఆదివారం కల్లా బాగా పంచుకొని 90-95% కలెక్షన్స్ ని వసూలు చేస్తోంది. దీని ప్రకారం మొదటి రోజు మాత్రమే ఓవరాల్ గా 5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా కలెక్షన్స్ బాగా పెరగడం వలన మొదటి వీకెండ్ ఓవరాల్ గా 15 కోట్ల మార్క్ ని క్రాస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాని అక్కినేని నాగార్జున నిర్మించాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు