‘ఒక మనసు’ విడుదల తేదీ ఖరారు

‘ఒక మనసు’ విడుదల తేదీ ఖరారు

Published on May 25, 2016 8:30 PM IST

oka-manasu
‘ఒక మనసు’.. నాగ శౌర్య, నిహారిక హీరో, హీరోయిన్లుగా నటించగా దర్శకుడు రామరాజు తెరకెక్కించిన సినిమా. మెగా ఫ్యామిలీ నుంచి మొదటిసారి ఓ హీరోయిన్ ఎంట్రీ ఇస్తూ చేస్తూ చేసిన సినిమా కావడంతో ‘ఒక మనసు’ మొదట్నుంచీ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇక సునీల్ కశ్యప్ సమకూర్చిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా మెగా హీరోల సమక్షంలో పెద్ద ఎత్తున నిర్వహించి సినిమాకు మంచి అంచనాలు తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఈ అంచనాల మధ్యనే సినిమాను జూన్ 24న విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించేశారు.

‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ సినిమాతో తన అభిరుచిని చాటిచెప్పుకున్న దర్శకుడు రామరాజు, ఈ సినిమాను కూడా అదే కోవలో ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కించిన విషయం పోస్టర్స్, ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. ఆడియో కూడా సినిమా మూడ్‌కి తగ్గట్టుగానే ఉండి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టీవీ 9 సంస్థతో కలిసి దర్శకుడు మధుర శ్రీదర్ ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు