ఓంకార్ నెక్స్ట్ సినిమా హీరో డిటైల్స్ !

ఓంకార్ నెక్స్ట్ సినిమా హీరో డిటైల్స్ !

Published on Jan 22, 2018 10:30 AM IST

బెల్లంకొండ శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు తెరకు వినాయక్ పరిచయం చేశాడు. ఈ సినిమా శ్రీనివాస్ కి మాస్ హీరోగా పేరు తెచ్చిపెట్టిన సినిమా జయ జానకి నాయక. ఈ మూవీ తరువాత శ్రీనివాస్ శ్రీవాసు దర్శకత్వంలో ‘సాక్షం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజా సమాచారం మేరకు బెల్లం కొండ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజుగారిగది సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. బెంగాల్ టైగర్ సినిమాను నిర్మించిన రాదా మోహన్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. త్వరలో ఈ సినిమా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు